అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు ఆందోళనకు దిగారు. గత సంవత్సరం జూలై లో పంట బీమా రావల్సిఉండగా, ఇప్పటి వరకు భీమా సొమ్ము అందలేదని నిరసన చేపట్టారు. స్థానిక తెలుగుదేశం నాయకులు రైతులకు మద్దతు పలికారు. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రామ్మోహన్ చౌదరి సంబంధిత బ్యాంకు మేనేజర్ ను సంప్రదించి, భీమా సొమ్ముపై వివరాలను అడిగారు.భీమా సొమ్ములపై జాబితా పూర్తయిన వెంటనే రైతులకు అందాల్సిన మొత్తాన్ని పంపిణీ చేస్తామని బ్యాంకు మేనేజర్ తెలపడంతో రైతులు శాంతించారు.
ఇదీచూడండి."మమ్మల్ని ఆ పులి బారి నుంచి కాపాడండి"