అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో.. రహదారి నిర్మాణం వివాదాస్పదంగా మారింది. మరికొమ్మదిన్నే నుంచి నల్లగుట్లపల్లికి వెళ్లేందుకు రోడ్డు వేయాలని అధికారులు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న రైతులు(farmers agitation) తమ భూమిలో రోడ్డు వేయవద్దంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న మహిళలను బలవంతంగా పోలీసుల జీపుల్లో స్టేషన్కు తరలించారు. పురుషులను బలవంతంగా పక్కకు నెట్టేశారు. ప్రైవేటు భూమిలో రోడ్డు వేస్తున్న వారిని అడ్డుకోవాల్సిన అధికారులు..తమపైనే దౌర్జన్యం చేశారని రైతులు వాపోయారు.
ఇదీ చదవండి:
Durga Temple: దుర్గగుడి అభివృద్ధి పనులకు బ్రేక్...కారణం ఏంటంటే..