Power cuts: కాలువ నీరు రాక.. కరెంటు లేక పంటలు మధ్యలోనే ఎండిపోతున్నాయి. అనంతపురం జిల్లా బొమ్మనహళ్, కనేకల్లు మండలాల్లో హెచ్చెల్సీ కాలువ కింద అత్యధికంగా వరి సాగు చేస్తారు. ఏటా మార్చి వరకు రైతులు కాలువలు, బోర్ల నీటిని పంటకు అందిస్తారు. ఈ ఏడాది మార్చి 5 వరకు కాలువ నీరు ఆపేశారు. ఆపై బోర్ల ద్వారా పంటకు నీరందించాలంటే విద్యుత్తు కోతలు పొలాల్ని ఎండబెట్టాయి.
రోజుకు కనీసం 3, 4 గంటలూ విద్యుత్తు ఇవ్వకపోవడంతో చాలా చోట్ల పైరు ఎండిపోయింది. మరో 20 రోజుల్లో పంట చేతికొస్తుందని రైతులు, తెదేపా నాయకులు ఆందోళన వ్యక్తం చేయగా విద్యుత్తుశాఖ మేల్కొని సరఫరా కాస్త మెరుగు పరిచింది. కానీ.. అప్పటికే నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఎండిపోయిన పంటకు తడిపెట్టినా చేతికందే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: