అనంతపురం జిల్లా పుట్టపర్తి సమీపంలోని చిత్రావది నది నుంచి ఇసుక తరలించడం తీవ్ర వివాదస్పదంగా మారింది. పంట పొలాల, వాహనాల పార్కింగ్ కోసం కేటాయించిన స్థలం నుంచి ఇసుకను ఎలా తరలిస్తారంటూ స్థానికులు అడ్డుకున్నారు. ఇసుక తరలిస్తే ఆత్మహత్య చేసుకుంటామని పెట్రోల్ బాటిళ్లతో రైతులు ఆందోళన దిగారు.
విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వారికి మద్దతు తెలిపారు. వారితో ఆందోళన కూడా చేశారు. గతంలో ఈ స్థలాన్ని పుట్టపర్తికి వచ్చే వేలాది మంది భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ కోసం కేటాయించామని గుర్తు చేశారు. అలాగే ఇక్కడ ఇసుక తరలిస్తే.. సమీపంలో భూగర్భజలాలు ఇంకిపోతాయన్నారు. ఇలాంటి వాటిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఎలా అనుమతులు ఇస్తారని పల్లె ప్రశ్నించారు.
ఇదీ చదవండి: