ETV Bharat / state

Land Kabja: రాత్రి నోటీసులు.. పొద్దున్నే హద్దు రాళ్లు.. స్థలంపై ముఖ్యనాయకుడి కన్ను.!

Farmers Land Occupied: దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉన్న భూములను శ్మశానం పేరిట కబ్జా చేసేందుకు జిల్లాలోని ముఖ్య నాయకులు యత్నిస్తున్నారని రైతులు వాపోయారు. రాత్రి నోటీసులు ఇచ్చి పత్తిపంటను తొలగించి అధికారులు శ్మశానానికి హద్దులు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

land occupied
land occupied
author img

By

Published : Jul 16, 2023, 10:33 AM IST

రాత్రి నోటీసులు.. పొద్దున్నే హద్దు రాళ్లు.. స్థలంపై ముఖ్యనాయకుడి కన్ను

Farmers Land Occupied: శ్మశానం నిర్మించడానికి అడ్డుగా ఉన్న పత్తి పంటను అధికారులు తొలగించారు. రాత్రి నోటీసులు ఇచ్చి.. ఉదయాన్నే హద్దులు ఏర్పాటు చేశారు. ఒక ముఖ్య నాయకుడి సిఫార్సు మేరకే అధికారులు ఈ విధంగా ప్రవర్తించారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని బొమ్మనహాల్ మండలం ఉప్పర హాల్ గ్రామంలో 42 సర్వే నంబరుకు సంబంధించి నరసింహులు, హేమావతి, వీరేష్, ఫక్కీరప్ప అనే రైతులు పత్తి పంట సాగు చేస్తున్నారు. గ్రామ సమీపంలో శ్మశానం హద్దులు ఏర్పాటు చేస్తున్నామని పత్తి పంటను తొలగించి అధికారులు హద్దులు ఏర్పాటు చేశారు. ఒక ముఖ్య నాయకుడు సిఫారసు మేరకే అధికారులు పంటను తొలగించారని బాధితులు ఆరోపించారు. రాత్రి నోటీసులు ఇచ్చి ఉదయమే అధికారులు హద్దులు వేశారని ఆందోళన వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల నుంచి ఆ భూమిలో సాగు చేసుకుంటున్నామని తెలిపారు. తమకు పాసు పుస్తకాలను ప్రభుత్వమే మంజూరు చేసిందని బాధిత రైతులు తెలిపారు.

"నేను రెండున్నర ఎకరాల్లో పంట సాగు చేశాను. గత నెలలోనే సర్వే చేసి పట్టా భూములు ఇచ్చారు. మా బంధువులకు ఆరోగ్యం బాగాలేకపోతే.. వేరే ఊరు వెళ్లాను. నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే.. నేను వచ్చేవరకు చూడకుండానే పంటను నాశనం చేశారు. పైగా నా పేరున భూమి లేదని చెప్పారు. నాకు చాలా కష్టం అయితోంది..న్యాయం చేయండి."-బాధిత మహిళా రైతు

3 ఎకరాలు మాత్రమే శ్మశాన వాటికకు సంబంధించిన భూమి ఉండగా, 11 ఎకరాలు ఉందని అధికారులు నోటీసులు ఇచ్చి హద్దులు ఏర్పాటు చేశారన్నారు. 8 ఎకరాలు నలుగురు రైతులకు సంబంధించిన భూమి అని.. దానికి సంబంధించిన పాసు పుస్తకాలను ప్రభుత్వమే ఇచ్చిందని తెలిపారు. ఆ స్థలం శ్మశాన భూమిది అయితే పాస్ పుస్తకాలను.. అధికారులు తమకెందుకు ఎందుకు ఇస్తారని రైతులు ప్రశ్నించారు. తాము నిరుపేద రైతులమని, బ్యాంకుల్లో బయట వ్యాపారుల దగ్గర అప్పులు చేసి పత్తి పంటను సాగు చేశామన్నారు. తమకు తెలియకుండా పొలంలో జేసీబీ సహాయంతో పత్తి పంటలు దౌర్జన్యంగా తొలగించి శ్మశానం కోసం కేటాయించడం వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు.

"ఈ భూమి మాది కాదు వాళ్లది అంటున్నారు. మరి మా భూమి ఎక్కడుంది. శ్మశాన ఏర్పాటు కోసం పంట అయిపోయిన తర్వాత వచ్చి కొలతలు వేసుకోమంటే వినలేదు. జేసీబీలతో వచ్చి పంటను తొక్కించారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి."-బాధిత రైతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.