ETV Bharat / state

అందని యంత్రం... సాగని సేద్యం..అన్నదాతల ఆందోళన

author img

By

Published : Nov 9, 2020, 7:56 AM IST

ప్రభుత్వం ఏటా ఖరీఫ్‌ ప్రారంభం నుంచే రైతులకు రాయితీ యంత్ర పరికరాలు అందించేది. అయితే ఈ ఏడు ఖరీఫ్‌ ముగిసి.. రబీ మొదలైనా రాయితీ పరికరాలు అందలేదు. దరఖాస్తు చేసుకున్న వారికి గత అక్టోబర్‌ 2వ తేదీన రాయితీ యంత్ర పరికరాలు అందిస్తామని ప్రకటించారు. నేటికీ సంబంధిత సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోలేదని తెలుస్తోంది. ఫలితంగా ఖరీఫ్‌ పంట కోతలకు, రబీ పంట సాగు పనులు మొదలు పెట్టినా పరికరాలు అందుబాటులో లేకపోవటంతో అనంతపురం జిల్లాలోని రైతులు ఆందోళన చెందుతున్నారు.

using tractor for farming
ట్రాక్టర్‌తో వ్యవపాయ పనులు చేస్తున్న రైతులు

అన్నింటికీ యంత్రాల వినియోగం

అనంతపురం జిల్లాలో ఖరీఫ్‌లో 6లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలను సాగు చేశారు. రబీలో సుమారు 2 లక్షలకు పైగా హెక్టార్లలో పంటలు సాగు చేయనున్నారు. అన్ని రకాల సాగు పనులు, పంట ఉత్పత్తుల రవాణాకు యంత్రాలనే వినియోగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నేరుగా రైతుకే రాయితీ పరికరాలను ఇవ్వాలని నిర్ణయించింది. అందుకు ప్రోత్సాహకాలను అందిస్తుంది. గత రెండేళ్ల మొత్తానికి రాయితీ సొమ్ము విడదల కాక యాంత్రీకరణ పథకం పడకేసింది. తాజాగా ప్రభుత్వం వ్యక్తిగతంగా ఇచ్చే ప్రోత్సాహకానికి బదులు రైతులను గ్రూపులుగా ఏర్పాటు చేసి ప్రోత్సాహం అందించాలని నిర్ణయం తీసుకుంది. అందుకనుగుణంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రూపులను ఏర్పాటు చేసి ఒక్కో గ్రూపునకు రూ.12 లక్షలు నుంచి రూ.15 లక్షల విలువైన యంత్రాలను రాయితీ రుణం ద్వారా అందజేస్తామని ప్రకటించింది.

కదిరి, పెనుకొండ డివిజన్లలో ఇదీ పరిస్థితి

ఆర్‌బీకేల ద్వారా ఇప్పటికే కదిరి, పెనుకొండ డివిజన్లలోని 16 మండలాల్లో 192 గ్రూపులు ఏర్పాటు చేయగా వీటిలో 172 గ్రూపులు బ్యాంకు ఖాతాలు తెరచి దరఖాస్తు చేసుకున్నారు. యంత్ర పరికరాలకు సంబంధించి ధరలో 10 శాతం గ్రూపు మ్యాచింగ్‌ గ్రాంటు కింద చెల్లించాలి. ప్రభుత్వం ఇచ్చే 40 శాతం రాయితీపోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా ఇస్తారు. గ్రూపులకు అవసరమైన రుణం ఇచ్చేందుకు ప్రభుత్వం నాబార్డుతో ఒప్పందం చేసుకుంది. జిల్లాకు సంబంధించి రుణాల మంజూరుకు డీసీసీబీ అంగీకరించింది. అయితే ఇప్పటి వరకూ గ్రూపులకు యంత్రాలు అందజేయలేదు. ట్రాక్టర్లు, యంత్ర పరికరాల సంస్థలతో ఇంకా ఒప్పందం కుదరక పోవడంతో రాయితీ పరికరాలు ఎప్పటికీ అందుతాయో అని రైతులు ఎదురు చూస్తున్నారు.

ప్రభుత్వం పరిధిలో ఉంది

మండల, డివిజన్‌ స్థాయిలోని ఆర్‌బీకేల పరిధిలో రైతులతో గ్రూపులను ఏర్పాటు చేశాం. రూ.5వేలతో రిజిష్టరు చేయించాం. మొత్తం 192 గ్రూపులు ఉంటే 190 గ్రూపుల వివరాలను నమోదు చేశాం. అందులో 187 ఆమోదాం పొందాయి. 172 మంది బ్యాంకు ఖాతాలు తెరిచి దరఖాస్తు చేసకున్నారు. ట్రాక్టర్లు, యంత్ర పరికరాల సరఫరా ప్రక్రియ ప్రభుత్వం పరిధిలో ఉంది. - సత్యనారాయణ, ఏడీఏ

ఇదీ చదవండి:

నవశకానికి లేపాక్షి నవోదయం.. గ్రామీణ విద్యార్థులకు వరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.