నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకూ ఆందోళనలు విరమించేది లేదని రైతు, ప్రజా సంఘాల నాయకులు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా కదిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట 12 మండలాలకు చెందిన రైతులు ధర్నా చేపట్టారు. చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా.. కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే చట్టాలు తీసుకొచ్చారని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న రైతులను, వారికి మద్దతు తెలుపుతున్న వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: వైకాపా గుండాలకు భయపడం: జేసీ పవన్