Farmer Tried To Suicide: సొంత భూమి కోసం సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిరిగినా న్యాయం చేయటం లేదని ఆత్మహత్యకు యత్నించాడో రైతు. ఆ రైతు భూమిలో తనకు హక్కు ఉందని సమీప బంధువు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అందువల్ల పోలీసులు పలుమార్లు స్టేషన్కు పిలిపించి.. న్యాయం చేయటం లేదని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పూనుకున్నాడు.
అనంతపురం జిల్లాలోని ఇల్లూరు గ్రామానికి చెందిన శ్రీరాములు, సుజాతమ్మల కుమారుడు పురుషోత్తం. ఇతనికి వారసత్వంగా తల్లిదండ్రుల నుంచి వచ్చిన భూమిని సాగు చేసుకుంటున్నాడు. ఇతని బంధువు సుబ్బరాయుడు.. పురుషోత్తం తండ్రి శ్రీరాముల మధ్య నాలుగేళ్లుగా భూతగాదా నడుస్తోంది. పురుషోత్తం కుటుంబానికి చెందిన భూమిలో 56 సెంట్లు భూమి తనకు వస్తుందని సుబ్బరాయుడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ప్రతిసారి స్టేషన్కు పిలిచి న్యాయం చేయకుండా.. తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. పురుషోత్తం గార్లదిన్నెలో సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. తనకు న్యాయం చేయకపోతే దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దాదాపు గంటపాటు టవర్ పైన ఉన్న పురుషోత్తంకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వటంతో కిందకు దిగాడు.
ఇవీ చదవండి: