ETV Bharat / state

Farmers Protest: అనంతపురంలో అన్నదాతల నిరసన.. కేసులు నమోదు చేసిన పోలీసులు - అనంతపురం జిల్లా లేటెస్ట్ న్యూస్

Cases Against Protesting Farmers: అనంతపురం జిల్లాలో నష్టపోయిన పంటలకు బీమా పరిహారం కోసం రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ క్రమంలో జిల్లాలోని ఉరవకొండ మండలం చిన్నముష్టూరు రైతులు గ్రామ సచివాలయాన్ని ముట్టడించారు. అయితే ఆందోళనలో పాల్గొన్న రైతులతోపాటు వారికి మద్దతుగా నిలిచిన పలువురు టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 5, 2023, 7:35 AM IST

Farmer Protest For Crop Insurance: నష్టపోయిన పంటలకు బీమా పరిహారం కోసం నిరసనకు దిగిన అనంత రైతులపై.. పోలీసులు కేసులు నమోదు చేశారు. వారితో పాటు ఆందోళనలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులపైనా కేసులు పెట్టారు. రెండేళ్లుగా ఇదిగో అదిగో అంటూ బీమా పరిహారం ఇవ్వకుండా తిప్పుతున్నారన్న రైతులు.. ఇంకెంత కాలం కార్యాలయాల చుట్టూ తిరగాలని ప్రశ్నించారు. అందరికీ పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.

గతేడాది అన్ని పంటలూ నష్టపోయినా.. కొన్ని మండలాల్లోని రైతులకే ప్రభుత్వం బీమా వర్తింపజేయడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నముష్టూరు రైతులు గ్రామ సచివాలయాన్ని ముట్టడించారు. అన్నదాతల ఆందోళనకు తెలుగుదేశం, ఏపీ రైతుసంఘం మద్దతు పలికాయి. అధిక వర్షాలతో మిరప, వేరుసెనగ, కంది, ఆముదం పంటలు దెబ్బతిని పెట్టుబడి కూడా తిరిగి రాలేదని రైతులు వాపోయారు. గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి నెలకొందని.. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడం వల్లే సచివాలయాన్ని ముట్టడించామని చెప్పారు.

ప్రభుత్వం మారి.. కష్టాలు రెట్టింపు.. పరిహారం కోసం రైతుల పడిగాపులు

అయినా అధికారులెవరూ స్పందించకపోవడంతో.. రైతులతో కలిసి రైతు నేతలు, రాజకీయ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్ని పంటలకు, రైతులందరికీ బీమా పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 8న కల్యాణదుర్గంలో జరిగే సీఎం కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. కాసేపటి తర్వాత ఉరవకొండ అర్బన్‌ సీఐ హరినాథ్‌ ఆధ్వర్యంలో అక్కడికి వచ్చిన పోలీసులు.. రైతులను బలవంతంగా పక్కకు లాక్కెళ్లారు.

పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసిన రైతులు, రైతునేతలు.. బీమా ఇవ్వమని అడగడం తప్పా అని ప్రశ్నిస్తున్నారు. బీమా పరిహారం ఇచ్చే వరకూ పోరాటం ఆపేది లేదని రైతులు తేల్చిచెబుతున్నారు. రైతుల పోరాటానికి అండగా ఉంటామని తెలుగుదేశం నాయకులు స్పష్టం చేశారు. పోలీస్‌యాక్ట్‌-30 అమల్లో ఉండగా అనుమతి లేకుండా ధర్నా నిర్వహించారంటూ.. ఆందోళనలో పాల్గొన్న రైతులతో పాటు తెలుగుదేశం నేతలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ.. రైతుల నిరసన

"రైతుల పక్షాన నిలుస్తానని చెప్తున్న సీఎం జగన్.. మిరప, వేరుసెనగ పంటల్లో నష్టపోయిన రైతులకు ఇంతవరకూ పరిహారం అందించలేదు. అరవకొరవగా కొంతమందికి మాత్రమే ప్రభుత్వం బీమా వర్తింపజేసింది. 2021 సంవత్సరం నుంచి మా మండలంలో బీమా అందనివాళ్లు 1,300మందికి పైగా ఉన్నారు. దయచేసి మా అందరికీ బీమా అందించాలని కోరుతున్నాము." - స్థానిక రైతు

'మమ్మల్ని ఆదుకోండి.. లేదంటే ఆత్మహత్యకు అనుమతివ్వండి'.. ఉల్లిరైతుల వినతి!

"2021లో మేము మిర్చి పంటను సాగుచేశాము. పంట మొత్తం నష్టపోయాను. ఒక్కరూపాయి కూడా రాలేదు. దీనిపై స్పందనలో, ఉరవకొండ ఆఫీస్​లో కూడా అర్జీలు పెట్టాము. ఇలా ఎన్నిసార్లు దీనిపై అధికారులకు వద్దకు కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేదు. పోయినసారి కూడా వేరుసెనగ, మొక్కజొన్న పంటలను సాగు చేశాము. అది కూడా నష్టపోయాము. అప్పుడు కూడా పంటనష్టం బీమా అందలేదు. ఈ ఏడాది కూడా పంటను సాగుచేయగా.. మరీ అధ్వానంగా పంటను నష్టపోయాము." - స్థానిక రైతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.