అనంతపురం జిల్లా తలుపుల మండలంలో విషాదం జరిగింది. భూపతివారి పల్లికి చెందిన రైతు కృష్ణయ్య తన పొలంలో... కరెంట్ షాక్ తగలి అక్కడిక్కడే మృతి చెందాడు.
ఇదీ జరిగింది
రైతు కృష్ణయ్య తన పొలంలో విద్యుత్ అధికారులతో కొత్తగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఫ్యూజ్ సదుపాయాలు ఏర్పాటు చేయలేదు. సమస్యపై రైతు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని తానే... ఫ్యూజ్ తగిలిస్తుండగా...విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. రైతు మృతికి విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణని గ్రామస్థులు ఆరోపించారు.
ఇవీ చదవండి