ETV Bharat / state

అనంతలో దిశ డీఎస్పీ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా - పోలీసుల పేర్లపై నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు తాజా వార్తలు

సైబర్‌ నేరగాళ్లు పోలీసు అధికారుల పేరుతో ఫేస్‌బుక్‌ ఖాతాలు రూపొందించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ముందుగా సామాజిక మాధ్యమాలను తరచూ అనుసరిస్తున్న అధికారులను గుర్తిస్తున్నారు. ఎవరికి ఎక్కువ మంది అనుసరించే వారు (ఫాలోవర్స్‌) అధికంగా ఉన్నారో వారి పేరుతో ఓ నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను రూపొందిస్తున్నారు. వాస్తవ ఫేస్‌బుక్‌లో ఉన్న స్నేహితులకు తొలుత ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపుతూ.. డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు.

Fake Facebook account on dhisha DSP name
దిశ డీఎస్పీ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా
author img

By

Published : Dec 9, 2020, 12:40 PM IST

సైబర్‌ నేరగాళ్లు పోలీసు అధికారుల పేరుతో ఫేస్‌బుక్‌ ఖాతాలు రూపొందించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ముందుగా సామాజిక మాధ్యమాలను తరచూ అనుసరిస్తున్న అధికారులను గుర్తిస్తున్నారు. ఎవరికి ఎక్కువ మంది అనుసరించే వారు (ఫాలోవర్స్‌) అధికంగా ఉన్నారో వారి పేరుతో ఓ నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను రూపొందిస్తున్నారు. వాస్తవ ఫేస్‌బుక్‌లో ఉన్న స్నేహితులకు తొలుత ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపుతున్నారు. వారిని అనుసరిస్తూ.. కొన్ని మెసేజ్‌లు చేస్తారు. తర్వాత ఆ నకిలీ ఫేస్‌బుక్‌ ద్వారా తనను ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, అత్యవసరంగా డబ్బులు వేయాలని మెసెజ్‌లు పంపుతున్నారు. రూ.30 వేలతో ప్రారంభమై రూ.6 వేలు కావాలని పోస్టులు పెడుతున్నారు. జిల్లా పోలీసు శాఖలో ఇప్పటికే కొందరు అధికారుల పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌లు సృష్టించి సైబర్‌ నేరగాళ్లు వసూలకు పాల్పడుతున్నారు. తాజాగా జిల్లాలో బాగా ఫాలోయింగ్‌ ఉన్న దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసుల పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ సృష్టించారు. అందులో తనకు పైసలు కావాలని మెసేజ్‌లు పెడుతున్నారు. ఈ విషయాన్ని కొందరు డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన నకిలీ ఫేస్‌బుక్‌ను రద్దు చేయాలని సైబర్‌ పోలీసులను కోరారు.

ఈ విషయంపై డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. సైబర్‌ నేరగాళ్లు తన పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా తెరచినట్లు తెలిసిందన్నారు. నకిలీ ఫేస్‌బుక్‌లో వచ్చిన పోస్టులను పరిగణలోకి తీసుకోరాదని తన వాస్తవ(ఒరిజినల్‌) ఫేస్‌బుక్‌లో పోస్టు చేశానన్నారు. తన అభిమానులు, స్నేహితులు, తోటి అధికారులు సైబర్‌ నేరగాళ్ల మోసాలను గుర్తించాలని సూచించారు. నకిలీ పోస్టులకు ఎవరూ మోసపోరాదని పేర్కొన్నారు.

ఇవీ చూడండి...

ఎమ్మెల్యే, కార్యకర్తల మధ్య వాగ్వాదం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.