అనంతపురం జిల్లాలో 80 శాతం పూర్తయిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలని తెదేపా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి డిమాండ్ చేశారు. కరోనా వైరస్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వెంటనే ప్రారంభించాలని పార్టీ శ్రేణులతో కలిసి దీక్ష చేపట్టారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కరోనా ఆసుపత్రుల్లో ఆర్డీటి ఆస్పత్రిలో తప్ప...ఏ ఒక్క చోట ప్రజలకు అవసరమైన వైద్యం అందడం లేదని విమర్శించారు. జిల్లా అధికార యంత్రాంగం, పాలకులు ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ప్రజల ఆరోగ్యం దృష్ట్యా రాయలసీమ వ్యాప్తంగా గతంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను అన్ని హంగులతో నిర్మించామని అయినా వాటిని ప్రారంభించకపోవడం వైకాపా నిర్లక్ష్యానికి నిదర్శనమని గుర్తు చేశారు. ఆసుపత్రి ప్రారంభానికి జిల్లాలోని మంత్రులు వెంటనే చొరవ తీసుకుని ప్రజలకు సరైన వైద్యం అందించాలి కోరారు. లేనిపక్షంలో ప్రజా సంఘాలు, ఇతర అఖిలపక్ష పార్టీలతో కలిపి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీచదవండి
'అవినీతిపరుల పాలనలో మూడు ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందా? '