ETV Bharat / state

కాల్వ శ్రీనివాసులు మీడియా సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు

author img

By

Published : Jan 5, 2020, 10:02 AM IST

తెదేపా పొలిట్​బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు.. అనంతపురంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు.. పలువురు ఇతర నేతలను అదుపులోకి తీసుకున్నారు.

kalava srinivasulu arrest in rayadurgam
రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు అరెస్టు
రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు అరెస్టు

మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాన్ని అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీసులు అడ్డుకున్నారు. కాల్వ శ్రీనివాసులు ఓ ప్రైవేటు భవనంలో సమావేశం నిర్వహిస్తుండగా, అనుమతులు లేవని పోలీసులు నాయకులకు తెలిపారు. అనంతరం భవనానికి తాళం వేసిన కారణంగా.. నాయకులు భవనానికి ఎదురుగా బయటే కూర్చొని, సమావేశాన్ని నిర్వహించారు. వెంటనే.. పోలీసులు మాజీ మంత్రిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు. అనంతరం బెయిల్​పై విడుదలైన కాల్వ శ్రీనివాసులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న సమావేశాన్ని పోలీసులు అడ్డుకొని, అరెస్టులు చేయటం దారుణమన్నారు. రాజధానిపై వేసిన కమిటీలు రాష్ట్రంలో పర్యటించాయా? అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

అమరావతి కోసం అనంతపురం ఐకాస కార్యాచరణ సిద్ధం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.