అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వై. రాంపురం గ్రామంలో ఎర్రితాత స్వామి రథోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. స్వామి రథోత్సవాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఉంచి పురవీధుల్లో ఊరేగించారు. రథం ముందు భక్తులు గుమ్మడికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి. కరోనా లక్షణాలుంటే తిరుమలకు రావొద్దు