అనంతపురం జిల్లా తలుపుల మండలం వేపమానిపేట రైతు భరోసా కేంద్రానికి రంగులు వేస్తున్న సమయంలో విద్యుదాఘాతం చోటు చేసుకోవడం వల్ల వ్యక్తి మృతి చెందాడు. బిహార్‌కు చెందిన మహమ్మద్ సద్దాం(26) భవనానికి రంగులు వేయడానికి వచ్చాడు. రంగులు వేసే సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహమ్మద్ సద్దాం విద్యుదాఘాతానికి గురై భవనం పైనుంచి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన పెయింటర్ని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు.
ఇది చదవండి: