ఈనాడు, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక కేజీబీవీ పాఠశాల విద్యార్థినులు ఓటు విలువ తెలియజేస్తూ తల్లిదండ్రులకు పోస్ట్ కార్డులపై ఉత్తరాలు రాశారు. ఓటర్లు ప్రలోభాలకు గురి కాకుండా నిష్పక్షపాతంగా నీతి నిజాయతీతో సేవచేసే నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఓటును నోటుకు అమ్మకుండా భావితరాల భవిష్యత్తుకై నిస్వార్థంగా వినియోగించుకోవాలని కోరారు.
ఇవీ చూడండి: