అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గంలోని వ్యవసాయ సబ్ డివిజన్లో మంగళవారం కురిసిన వర్షానికి చెక్ డ్యాంలు నిండాయి. కళ్యాణదుర్గం, కుందుర్పి, కంబదూరు, శెట్టూరు, బ్రహ్మసముద్రం మండలాల్లోని పలు వాగులు ప్రవహించాయి.
కళ్యాణదుర్గం మండలం దురద కుంట శివార్లలో ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు, పండ్ల తోటలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉద్యాన అధికారులు పంట నష్టం అంచనా వేసి... పరిహారం అందించాలని పలువురు రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండ: కరోనా కాటు.. మాడిన క్యాబేజీ పంట