ETV Bharat / state

రథోత్సవంలో.. గాడిదల పరుగు పందెం - అనంతపురం జిల్లా లేటెస్ట్ అప్​డేట్స్

Donkey running competitions: సాధారణంగా రథోత్సవం అంటే దేవతా మూర్తులను రథంపై ఊరేగిస్తారు. కానీ.. ఇక్కడ రథోత్సంలో ఓ ప్రత్యేక ఉంది. అది అందరిలో ఆశ్చర్యాన్ని, ఆసక్తిని రేకెత్తిస్తోంది.. ఇంతకీ అందేంటంటే.. ఈ ఉత్సవాల్లో గాడిదలకు పరుగు పందెం నిర్వహిస్తారు. మరి, ఈ వింత వేడుక వేడుక ఎక్కడో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.

Donkey running competitions
గాడిదల పరుగు పోటీలు
author img

By

Published : Apr 22, 2022, 7:08 PM IST

Donkey running competitions: అనంతపురం జిల్లా వజ్రకరూర్​లో వెలసిన శ్రీ జనార్ధన వెంకటేశ్వర స్వామి రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వినూత్నంగా గాడిదల పరుగు పోటీని నిర్వహించారు. గాడిదలపై వాటి యజమానులు కూర్చొని.. వాటిని పరిగెత్తిస్తూ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఈ పోటీలో గుర్రాలకు తామేమీ తీసిపోమంటూ.. తగ్గేదేలే అన్నట్టుగా పరుగులు తీశాయి గాడిదలు. ఈ పరుగు పోటీలను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి జనం తండోపతండాలుగా తరలివచ్చారు.

గాడిదల పరుగు పోటీలు

ఈ పోటీలను క్రీడామైదానంలో కాకుండా.. రోడ్డు మీదనే నిర్వహించారు. వజ్రకరూరు నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరం వెళ్లి.. తిరిగి వజ్రకరూరుకు వచ్చే విధంగా మొత్తం 18 కిలోమీటర్ల దూరం ఈ గాడిదల రన్నింగ్ పోటీ నిర్వహించారు. ఈ రేసులో చివరకు మూడు గాడిదలు మాత్రమే మిగిలాయి. ఆద్యంతం ఆసక్తికరంగా, పోటాపోటీగా సాగిన ఈ గాడిదల పరుగు పందేన్ని.. యువకులు బైకులపై ప్రయాణిస్తూ తిలకించారు.

ప్రతీ సంవత్సరం ఈ పోటీలను నిర్వహిస్తున్నామని కరోనా కారణంగా గత రెండేళ్లు నిర్వహించలేక పోయామని నిర్వాహకులు తెలిపారు. పరుగు పందెంలో విజయం సాధించిన వారికి నగదు బహుమతి అందజేసి.. శాలువా కప్పి సత్కరించారు.

ఘనంగా రథోత్సవం: వజ్రకరూర్​లో జనార్ధన వెంకటేశ్వర స్వామి రథోత్సవం గురువారం సాయంత్రం కన్నులపండువగా జరిగింది. రథోత్సవాన్నీ తిలకించడానికి చుట్టుపక్కల మండలాలు, ఇతర గ్రామాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై... మొక్కులు తీర్చుకున్నారు.. ఈ గ్రామంలో ఈ కార్యక్రమానికి అక్కడి పోలీస్ ఉన్నతాధికారులకు సన్మానం చేసి...పోలీస్ స్టేషన్ నుంచి భాజా భజంత్రీల మధ్య దేవాలయానికి పిల్చుకుని రావడం ఇక్కడి సంప్రదాయం. కార్యక్రమం అనంతరం రథం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు తెల్లవారుజామున స్వామివారి మూల విరాట్​కు అభిషేకం, అలంకరణ, అర్చనలు, పూజలు చేశారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి క్షేత్రం ఆవరణంలో భాజాభజంత్రీల నడుమ ఊరేగించారు. సాయంత్రం రథంపై ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి రథాన్ని లాగారు.

ఇదీ చదవండి: శునకం.. మేక పిల్లలకూ అమ్మయ్యిందిగా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.