కార్తీక మాసం తొలి శనివారాన్ని పురస్కరించుకొని అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ మాసంలో ప్రజలు ఎక్కువగా దీపారాధన చేస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారి ధ్వజస్తంభం ఎదుట కార్తీక దీపాలను వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.
కర్ణాటకవాసులకు కదిరి నరసింహస్వామి ఇలవేల్పు. ఇంటి దైవానికి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. స్థానికులతో పాటు పెద్ద ఎత్తున పక్కరాష్ట్రం నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయ పరిసరాలన్నీ భక్తులు.. వారు వెలిగించిన దీపాలతో నిండిపోయింది.
ఇదీ చదవండి: పుష్పయాగానికి సిద్ధంగా.. 7 టన్నుల పూలు