అనంతపురం జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలతో.. డీఎంహెచ్వో బృందం ఐదు డయాగ్నస్టిక్ సెంటర్లపై దాడులు నిర్వహించింది. నగరంలో ఉన్న స్టార్ డయాగ్నస్టిక్ సెంటర్లో అధిక ఫీజు వసూలు చేస్తున్నారని నిర్థరణ కావటంతో.. ఆ కేంద్రాన్ని సీజ్ చేయాలని కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు.
ఆసుపత్రి నుంచి సిఫార్సు లేకుండా.. స్వతహాగా టెస్టులు నిర్వహిస్తున్నారనీ... అధిక ఫీజులు వసూలు చేస్తూ కరోనా కాలంలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఫిర్యాదులతో దాడులు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ప్రజల నుంచి అధిక మెుత్తంలో ఫీజులు వసూలు చేసే సెంటర్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: