ETV Bharat / state

'గుత్తి గురుకుల పాఠశాల హాస్టల్ వార్డెన్​ను సస్పెండ్ చేయాలి' - guthhi gurukul school

అసభ్య పదాలతో విద్యార్థులను వేధిస్తున్న అనంతపురం జిల్లా గుత్తి గురుకుల పాఠశాల వసతిగృహ వార్డెన్​ను సస్పెండ్ చేయాలని ఎస్​ఎఫ్​ఐ నాయకులు ఆందోళన చేశారు. హాస్టల్ వార్డెన్ అసభ్య పదజాలం, కులం పేరుతో దూషిస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని పాఠశాల ఎదుట ఎస్​ఎఫ్​ఐ నాయకులు ధర్నా చేశారు.

dharna-of-sfi-leaders-in-bouquet-to-suspend-gurukul-school-warden
గురుకుల పాఠశాల వార్డెన్​ను సస్పెండ్ చేయాలని గుత్తిలో ఎస్​ఎఫ్​ఐ నాయకుల ధర్నా
author img

By

Published : Mar 7, 2020, 10:35 PM IST

గురుకుల పాఠశాల వార్డెన్​ను సస్పెండ్ చేయాలని గుత్తిలో ఎస్​ఎఫ్​ఐ నాయకుల ధర్నా

వార్డెన్​ విద్యార్థులకు భోజనాలు పెట్టకుండా మానసికంగా వేధిస్తున్నారని ఎస్​ఎఫ్​ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై కలెక్టర్​కు లేఖ రాసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. ప్రిన్సిపల్​ కూడా ఆమెకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించి, వార్డెన్​ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేక పోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

ఇదీచదవండి.

భూసేకరణ పనులు పరిశీలించిన సీఎస్ నీలంసాహ్ని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.