ETV Bharat / state

ప్రభుత్వ పాలనే పంచాయతీల్లో గెలిపించింది: మంత్రి అంజాద్‌బాషా - అనంతపురం జిల్లా తాజా వార్తలు

రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతలు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైకాపా బలపరచిన అభ్యర్థులే గెలిచారని మంత్రి అంజాద్‌బాషా తెలిపారు. సొంత నియోజకవర్గంలో గెలవలేని చంద్రబాబు నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Deputy Cm On Elections
Deputy Cm On Elections
author img

By

Published : Feb 19, 2021, 11:15 AM IST

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనతో సంతృప్తి చెందిన ప్రజలు పంచాయతీల్లో గెలిపించారని ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా తెలిపారు. గురువారం కదిరిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతలు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైకాపా బలపరచిన అభ్యర్థులే గెలిచారని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో 89 స్థానాలకు 74పంచాయతీలను వైకాపా మద్దతు అభ్యర్థులు గెలిచారన్నారు. సొంత నియోజకవర్గంలో గెలవలేని చంద్రబాబు నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్‌ పి.వి.సిద్ధారెడ్డి మాట్లాడారు.

ఇదీ చదవండి : దేశవ్యాప్తంగా లోకాభీష్టప్రదాత సూర్యుడి రథసప్తమి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.