ETV Bharat / state

108 వాహనంలో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం - pregnent lady delivery in anantapuram district

అనంతపురం జిల్లా మడకశిర మండలం దొడ్డేపల్లికి చెందిన గర్భిణికి పురిటి నొప్పలు రావడంతో హుటాహుటిన 108 వాహనానికి సమాచారం అందించారు. గ్రామం నుంచి మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా... నొప్పులు తీవ్రమయ్యాయి. 108 వైద్య సిబ్బందే ఆ మహిళకు ప్రసవం చేశారు.

delivery in 108 vehicle in anantapuram
delivery in 108 vehicle in anantapuram
author img

By

Published : Jul 10, 2021, 7:58 AM IST

ఓ గర్భిణీ 108 వాహనంలోనే పండండి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతపురం జిల్లా మడకశిర మండలం దొడ్డేపల్లి గ్రామంలో చైత్ర అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆమె భర్త 108 అంబులెన్స్ వాహనానికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది ఆమెను 108 వాహనంలో మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో నొప్పులు అధికమయ్యాయి.

ఈఎంటీ హేమలత అప్పటికప్పుడు స్పందించి.. మహిళకు ప్రసవం చేశారు. చైత్ర... పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లిని బిడ్డను క్షేమంగా మడకశిర ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చాకచక్యంగా ప్రసవం చేసి తల్లీబిడ్డను కాపాడిన 108 సిబ్బంది ఈఎంటీ హేమలత​, పైలెట్​, వైద్య సిబ్బందిని మహిళ బంధువులు అభినందించారు.

ఇదీ చదవండి:

Leopard cub: చిరుత పిల్లకు పాలు పట్టించిన అధికారులు.. ఎక్కడంటే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.