భూమికి పట్టాదారు పాసు పుస్తకం ఇప్పిస్తామంటూ అమాయకులైన దంపతుల నుంచి సుమారు లక్షా 29 వేల రూపాయలు వసూలు చేసిన మోసగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా తనకల్లు మండలం నల్లగుట్లపల్లికి చెందిన రమణ, మంజుల దంపతులకు 85 సెంట్ల భూమి ఉంది. ఈ భూమికి పట్టాదారు పాసు పుస్తకం చేయిస్తామంటూ విడతల వారీగా డబ్బులు వసూలు చేశారు. మోసం గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దంపతులను మోసం చేసిన నిందితులు శ్రీనివాసులు, మల్లికార్జున, రమణ, రాజశేఖర్ లను అరెస్ట్ చేసినట్లు ఎస్సై రంగడు తెలిపారు.
సంబంధిత కథనం