ETV Bharat / state

కళ్యాణదుర్గంలో భారీ వర్షం.. పంటలకు తీవ్ర నష్టం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా అరటి చెట్లు విరిగి పోవటంతో రైతులు తీవ్ర ఆవేదన చెందారు. మరో వైపు భూగర్భ జలాలు పెరగటం ఉపయోగకరమైనప్పటి.. పంట నష్టానికి ప్రభుత్వం సాయం అందించాలని కోరుతున్నారు.

author img

By

Published : Jul 7, 2021, 2:11 PM IST

Crop damaged
పంట నష్టం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కురిసిన వర్షాలకు నదులు, వాగులు, పొంగి.. చెరువులకు నీరు చేరాయి.

కళ్యాణదుర్గం మండలం ముదిగల్లు గ్రామంలో రైతు మంజునాథకు చెందిన 250కి పైగా అరటి చెట్లు ఈదురు గాలులు వర్షానికి నేలమట్టమయ్యాయి. కోతకు సిద్ధంగా ఉన్న అరటి చెట్లు కూలిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

పెరిగిన భూగర్భ జలాలు..

బ్రహ్మసముద్రం మండలం తీటకల్లు గ్రామంలో చెరువుకు భారీగా వరద నీరు చేరింది. ఈ వర్షాలు భూగర్భ జలాలు పెరగడానికి ఉపయోగకరంగా ఉంటాయని రైతులు భావిస్తున్నా, ప్రస్తుతం కొన్ని పంటలు దెబ్బతినడంతో రైతులు తమకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.

ఇదీ చదవండీ.. గట్ల వద్ద గంజాయి దాస్తే.. పోలీసులు పట్టుకున్నారు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.