నాలుగేళ్ల తర్వాత ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా కురిశాయి. కుంటలు, చెరువులు నిండాయి. నీటిని సద్వినియోగం చేసుకుంటూ రైతులు విస్తారంగా వరి సాగు చేశారు. నివర్ తుఫానుతో పాటు.. ఏకధాటిగా కురిసిన వర్షాలకు అనంతపురంలో పంట చేలు నీట మునిగాయి. కోతకు వచ్చిన వరిమళ్లు వారం వరకు నీటిలోనే ఉండిపోవటంతో పొలంలోనే మొలకలు వచ్చాయి.
వానలకు ముందుగా వరికోసి.. కుప్పలుగా ఉన్న ధాన్యాన్ని నిల్వ చేయలేకపోవటం వల్ల కూడా రైతులు నష్టపోయారు. వరి గింజలు తడిసి మొలకలు వచ్చాయి. కొంత ధాన్యం రంగు మారింది. వర్షాలు తగ్గిన తరువాత కొందరు రైతులు పంట కోతలకు సిద్ధమయ్యారు. కానీ వరిపైరు నేలకొరగటంతో కోతలు కష్టంగా మారాయి. ఫలితంగా ఎక్కువ కూలీ చెల్లించాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కదిరి వ్యవసాయ డివిజన్లో 351 హెక్టార్లలో 980 మంది రైతుల పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు అధికారులు తేల్చారు. మొలకెత్తిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి.. ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: