ETV Bharat / state

అనంతలో రిటర్నింగ్‌ అధికారులపై విమర్శలు.. ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆందోళనలు

author img

By

Published : Feb 18, 2021, 9:42 PM IST

పంచాయతీ మూడోదశ ఎన్నికల వేళ అనంతపురం జిల్లాలో పలుచోట్ల ఉద్రిక్తతలు తలెత్తాయి. ఫలితాల వెల్లడిలో జాప్యం చేశారంటూ కొన్నిచోట్ల అభ్యర్థులు ఆందోళన చేయగా.. ఇంకొన్నిచోట్ల పరాజితులు రీకౌంటింగ్‌ పేరిట రోడ్డెక్కడం హైడ్రామాకు దారితీసింది.

Criticisms on Returning officers at anantapuram district
ఫలితాలు వెల్లడిలో జాప్యంపై ఆందోళనలు
ఫలితాలు వెల్లడిలో జాప్యంపై ఆందోళనలు

మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల వెల్లడిలో జాప్యం జరగడం.. అనంతపురం జిల్లాలో కొన్నిచోట్ల రిటర్నింగ్‌ అధికారులపై విమర్శలకు.. ఆస్కారమిచ్చింది. ఆత్మకూరు మండలం మదిగుబ్బ పంచాయతీలో 132 ఓట్లతో భాస్కర్ నాయక్ గెలిచినట్లు చెప్పిన.. రిటర్నింగ్‌ అధికారి ప్రత్యర్థుల ఒత్తిడితో ధ్రువీకరణపత్రం ఇవ్వడంలో జాప్యం చేశారని.. ఓ వర్గం ఆరోపించింది. రెండోసారి ఓట్లు లెక్కించినా తొలుత గెలిచిన అభ్యర్థికే ఆధిక్యం వచ్చిందన్న వారు.. ఫలితం ప్రకటించకుండా మూడోసారి లెక్కించారని.. భాస్కర్‌ నాయక్‌ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓబులాపురంలోనూ అలేగా జరిగింది. 2 ఓట్ల ఆధిక్యంతో.. శ్రీనివాసులు గెలుపొందగా ప్రత్యర్థి రీ కౌంటింగ్ కు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే.. అధికారులు ధ్రువపత్రం ఇవ్వడంలో జాప్యం చేయడం.. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకునేందుకు యత్నించగా.. పోలీసులు పరిస్థితిని అదుపుచేశారు.

గెలుపొందిన అభ్యర్థి ఇంటిపై ప్రత్యర్థి వర్గం రాళ్లదాడి..

నార్పల మండలం సిద్దరాచర్ల పంచాయతీలో.. 3ఓట్ల ఆధిక్యంతో శివానంద గెలుపొందగా.. రీకౌంటింగ్ చేసి ప్రత్యర్థి రామాంజి గెలిచినట్లు అధికారులు ప్రకటించే ప్రయత్నం చేశారు. గుంతకల్లు మండలం నెలగొండలో.. మనీలమ్మ 40 ఓట్ల ఆధిక్యంతో గెలిచినట్లు ప్రకటించిన అధికారులు..రీ కౌంటింగ్ చేసి ప్రత్యర్థి భాగ్యమ్మ గెలిచినట్లు వెల్లడించారు. మనీలమ్మ వర్గం వారు ఆందోళనకు దిగింది. గుత్తి మండలం పి.ఎర్రగుడిలో.. ఇద్దరు సర్పంచి అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. చెల్లని ఓటును.. ఓ అధికారి ఓ అభ్యర్థి ఖాతాకు కలిపే ప్రయత్నం చేశారంటూ వివాదం రేగింది. ఈ సమయంలో సదరు పోలింగ్ అధికారి కుప్పకూలగా.. ఆసుపత్రికి తరలించారు. ఉరవకొండ వ్యాసాపురంలో.. గెలుపొందిన అభ్యర్థి ఇంటిపై ప్రత్యర్థి వర్గం రాళ్లదాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గాయాలతోనే పోలీస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

ఇవీ చూడండి:

ఉరవకొండ 3వ వార్డులో నిలిచిన పోలింగ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.