ETV Bharat / state

CPI State Secretary Ramakrishna Allegations on CM Jagan: జగన్​కు సుప్రీంకోర్టు అన్నా... లెక్క లేకుండా పోయింది: సీపీఐ రామకృష్ణ - AP Latest News

CPI State Secretary Ramakrishna Allegations on CM Jagan: సీఎం జగన్​కి సుప్రీం కోర్టు అన్నా లెక్క లేకుండా పోయిందని.. మూడు రాజధానుల అంశం సుప్రీంలో ఉండగా ఆయన పరిపాలన రాజధానిని విశాఖకు తరలించడం ఏమిటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. అలానే రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఊబిలోకి తీసుకెళ్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు మండిపడ్డారు.

ramakrishna_allegations_on_jagan
ramakrishna_allegations_on_jagan
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 12, 2023, 4:24 PM IST

Updated : Oct 12, 2023, 7:56 PM IST

CPI State Secretary Ramakrishna Allegations on CM Jagan: జగన్​కు సుప్రీంకోర్టు అన్నా... లెక్క లేకుండా పోయింది: సీపీఐ రామకృష్ణ

CPI State Secretary Ramakrishna Allegations on CM Jagan: సీఎం జగన్​కి ప్రజలు, ప్రతిపక్షాలు మాత్రమే కాదు.. చివరకు సుప్రీం కోర్టు అన్నా లెక్క లేకుండా పోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI State Secretary Ramakrishna) ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల అంశం సుప్రీం కోర్టులో ఉండగానే ఆయన పరిపాలన రాజధానిని విశాఖకు తరలించడం ఏంటని ప్రశ్నింటారు. చట్టాన్ని అమలు చేయాల్సిన ఒక ముఖ్యమంత్రి ఇలా దొడ్డి దారిన వెళ్తున్నారని ఆరోపించారు.

CPI Ramakrishna on Illegal Liquor Sales in AP: పురందేశ్వరి ఇచ్చిన 'మద్యం ఫిర్యాదు'పై.. కేంద్రం సీబీఐతో దర్యాప్తు చేయించాలి : సీపీఐ

జగన్ వెనుకబడిన ప్రాంతాల కోసం వెళ్తున్నా అని చెబుతున్నారు.. కాని కేంద్రం ఇచ్చిన లెక్కల ప్రకారం రాయలసీమలోని నాలుగు జిల్లాలు వెనుకబడిన ప్రాంతాలే కదా.. మరి ఇక్కడి నుంచి ఎందుకు పాలన చేయలేదని ప్రశ్నించారు. అలానే టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ (Chandrababu arrest) చేసి నెల రోజులవుతున్నా ఒక్క ఆధారం కూడా చూపలేదని అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఇంకా పేపర్ల మీద ఉండగానే కేసులు పెడుతున్నారంచే చంద్రబాబు మీద కేవలం కక్షసాధింపు కోసమే కేసులు పెట్టి ఇలా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

CPI Ramakrishna on Pawan Kalyan వైసీపీని ఓడించేందుకు పవన్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాం.. కానీ : సీపీఐ రామకృష్ణ

కేంద్ర ప్రభుత్వం కర్ణాటక ఎన్నికల సమయంలో అప్పర్ భద్ర ప్రాజెక్టును (Appara Bhadra Project) జాతీయ ప్రాజెక్టుగా మార్చిందని.. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు ఉన్నాయని కృష్ణాజలాల విషయంలో నోటిఫికేషన్ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై జగన్ ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. జగన్ ప్రతీసారి వైనాట్ 175 అంటున్నారు కాని రాష్ట్రంలో అధికార పార్టీ కార్పొరేటర్లే నిలదీస్తుంటే ఇంకెక్కడ 175 అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రశాంతత రావాలంటే సీఎం జగన్ పాలన పోవాలి ఆయన్ని ఎలాగైనా గద్దె దించాలి దీని కోసం అంతా ఐక్యం కావాలన్నారు.

CPI Leader Ramakrishna on Beach Sand Mining బీచ్ శాండ్ మైనింగ్​లో జగన్​కు కమిషన్.. ఆ సొమ్ముతో ఎన్నికలకు సిద్దమైన వైసీపీ: రామకృష్ణ

CPI State Assistant Secretary Muppalla Nageswarao allegations on CM Jagan: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు మండిపడ్డారు. గుంటూరు సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ కార్పొరేషన్లు సంస్థలు కాంట్రాక్టర్ల కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన నిధులు, పంచాయతీ నిధులు (Panchayat funds) ఇలా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు కేంద్ర సహకరించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. రాజకీయ కక్ష సాధింపునకు సీఎం జగన్ పాల్పడుతున్నారని అన్నారు. వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు సీఎం జగన్ రాజకీయ ఉచ్చులో చిక్కుకోవద్దని కోరారు. ఇదిలా ఉండగా వైసీపీలో ఉన్న నాయకులు మాత్రం అందిన కాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ నాయకులు చేస్తున్నవి అన్నీ ప్రజలు గమనిస్తున్నారు త్వరలోనే ప్రజలు మీకు ఓటు రూపంలో తగిన బుద్ది చెప్తారని అన్నారు.

Last Updated : Oct 12, 2023, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.