సామాన్యంగా అయితే ఆవుకు ఒక ఈతలో ఒకే దూడ జన్మిస్తుంది. అందుకు భిన్నంగా.. అనంతపురం జిల్లాలో గోమాతకు.. ఒకేసారి మూడు దూడలు జన్మించాయి. దీంతో అంతా ఆశ్యర్యానికి గురవుతున్నారు. కొందరైతే త్రిమూర్తులే గోమాతకు పుట్టారంటూ.. పూజలు చేశారు. జిల్లాలోని మడకశిర మండలం చందకచర్ల గ్రామంలో రంగప్ప అనే రైతు గోవులను పోషిస్తూ.. వ్యవసాయం చేసుకుంటున్నాడు. అందులో ఓ ఆవు ఒకే ఈతలో మూడు ఆవు దూడలకు జన్మనిచ్చింది. కాగా ఇది జన్యుపరంగా వచ్ఛే మార్పులని పశు వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి:
BORN BABY DIED: గర్భిణికి శస్త్రచికిత్స చేసి కాన్పు చేసిన నర్సులు.. శిశువు మృతి..