అనంతపురం జిల్లా గోరంట్ల మండలం మందలపల్లికి చెందిన చండ్రాయుడు ఆవును పెంచుకుంటున్నాడు. తాను అపురూపంగా చూసుకుంటున్న గోమాతకు గురువారం జన్మదిన వేడుకలు నిర్వహించారు. చిన్నారులను పిలిచి కేక్ కట్ చేశారు. తన ఆరో కుమార్తెగా ఆవును భావించి లక్ష్మీ అని నామకరణం చేశానని యజమాని తెలిపారు. గత నాలుగేళ్లుగా ఏటా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు చండ్రాయుడు చెప్పారు.
ఇదీ చదవండి