ETV Bharat / state

పడకలు లేక... కొవిడ్​ బాధితుల నిరీక్షణ! - anantapur government hospital news

కరోనా బాధితులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడుతోంది. రోగులు పడకల కోసం వేచి ఉండాల్సి వస్తోంది. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పరీక్షలు, చికిత్స కోసం వచ్చిన వారితో భౌతిక దూరం పాటించే పరిస్థితి కూడా లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

patients waiting for beds
ఆస్పత్రిలో బెడ్లు లేక రోగుల ఇబ్బందులు
author img

By

Published : May 9, 2021, 5:23 PM IST

అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో పడకల కొరతతో కొవిడ్​ రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి నిరీక్షించినా బెడ్లు దొరకని పరిస్థితి. కొంతమంది కుర్చీలలో కూర్చొని, మరికొందరు నేలపైన పడుకుని వైద్యం అందుకుంటున్నారు. ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న కారణంగా.. రోజురోజుకూ అధిక సంఖ్యలో జనం వస్తున్నారు.

ఒక్కోసారి సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం భౌతిక దూరం పాటించని పరిస్థితి నెలకొంది. పర్యవేక్షకులు కూడా లేని కారణంగా అక్కడకు వచ్చిన వారు భయాందోళనకు గురవుతున్నారు. ఆస్పత్రికి వెళ్తే.. వైరస్​ లేనివారికి సైతం అంటుకుంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.