అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ ప్రజల కోసం ఆలూరు పౌండేషన్ ఆధ్వర్యంలో కొర్రపాడు వద్ద సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో 200 పడకతో కొవిడ్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేశారు. 50 ఆక్సిజన్, 150 నాన్ ఆక్సిజన్ బెడ్లకు కలిపి మొత్తం రూ.30 లక్షలు ఖర్చైంది. ఈ హాస్పిటల్‌ను ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్సీ శమంతకమణి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రారంభించారు. నియోజకవర్గంలో ఉండే ప్రజలెవరు కరోనాతో ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో 200 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అన్నారు. కొవిడ్ వచ్చిన వారూ ఈ ఆసుపత్రిలో సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఇదీ చూడండి.
అత్తింటికి తీసుకెళ్తానని చెప్పి.. కుమార్తెపై అత్యాచారం చేశాడు!