భార్య ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేక ఓ వ్యక్తి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం రాళ్ల అనంతపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ప్రీతి, మచ్చింద్రలకు మూడు నెలల క్రితం వివాహమైంది. మేనమామ కూతురైన ప్రీతిని ... తల్లిదండ్రులు కాదన్నా ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. దీంతో ఇరుకుటుంబాల మధ్య చిన్నపాటి తగాదాలు జరుగుతుండేవి. అయితే.. ఈ రోజు ఉదయం ప్రీతి ఆత్మహత్య చేసుకోగా.. అది చూసి తట్టులేక పోయిన మచ్చింద్ర పొలానికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబాల ఒత్తిడి కారణంగానే వీరు ఆత్మహత్య చేసుకొని ఉంటారని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండీ...రాష్ట్రంలో కొత్తగా 137 కరోనా కేసులు.. నలుగురు మృతి