అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ పదవి కోసం స్థానిక ఎమ్మెల్యేకు భారీగా నగదు ముట్టజెప్పినట్లు 11వ వార్డు అభ్యర్థి భర్త వెంకటేశులు సంచలన ఆరోపణలు చేశారు. వైకాపాలో 11 ఏళ్ల నుంచి పనిచేస్తున్నానన్న ఆయన..తన భార్యకు చైర్‌పర్సన్ పదవి ఇప్పించేందుకు రెండున్నర కోట్లు ముట్టజెప్పానన్నారు. ఎమ్మెల్యే మోసం చేసి మరొకరికి చైర్‌పర్సన్ పీఠం దక్కేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాల్మీకి విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి వెంకటేశులు వర్గీయులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులకు వెంకటేశులు వర్గీయులకు మధ్య వాగ్వాదం జరిగింది.
ఇదీచదవండి: కల్యాణదుర్గం మున్సిపాలిటీ ఛైర్మన్‌గా తలారి రాజ్‌కుమార్