అనంతపురం నగరంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. నగరంలో పది రోజులుగా లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నప్పటికీ ఎక్కడా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా ప్రకటించిన కరోనా బులెటిన్ లో జిల్లా వ్యాప్తంగా 104 మందికి కొత్తగా వైరస్ సోకగా.. వీరిలో 82 మంది అనంతపురం నగరానికి చెందిన వారే కావటం నగర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
నీరుగంటి వీధి, ఓబులదేవర నగర్, జీసెస్ నగర్, పాతూరు ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గటం లేదు. విద్యుత్ నగర్ కూడలికి చుట్టుపక్కల కాలనీల్లో చాలా వరకు రెడ్ జోన్ పరిధిలోకి వెళ్లగా.. కాలనీ ప్రవేశ మార్గంలో రహదారిపై అడ్డుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
లాక్ డౌన్ ను కచ్చితంగా అమలు చేయకపోతే అనంతపురం నగరంలో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తాజా కరోనా బులెటిన్ లో వెల్లడించిన ప్రకారం.. తాడిపత్రిలో ఏడుగురికి, పెనుగొండలో నలుగురికి వైరస్ సోకింది.
ఇదీ చూడండి: