అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఉరవకొండలో ఆరుగురికి కరోనా లక్షణాలు వెలుగు చూశాయి. పట్టణంలోని ఎస్ఎల్ఎన్ కాలనీలో ఐదుగురికి, అంబేద్కర్ నగర్లో ఒకరికి కోవిడ్ సోకిందని తహసీల్దార్ వాణిశ్రీ తెలిపారు. వారిని ప్రత్యేక అంబులెన్స్‌లో అనంతపురంకు తరలించారు.కొన్ని రోజుల క్రితం ఇదే కాలనీలో 12సంవత్సరాల అబ్బాయికి కరోనా పాజిటివ్ రాగా... దాదాపు 60 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాల్లో ఐదుగురికి వైరస్ నిర్ధరణ అయ్యింది. ఇంకొకరు హిందూపురం క్వారంటైన్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మహిళకు వచ్చింది.
ఇదీ చూడండి. రాష్ట్రంలో కొత్తగా 657 కరోనా కేసులు.. ఆరుగురు మృతి