ETV Bharat / state

వారమైనా రాని అంబులెన్స్... గాల్లో కలిసిన కరోనా బాధితురాలి ప్రాణం - అనంతపురంలో కరోనా మరణం న్యూస్

తల్లీ, కూతురుకు కరోనా సోకింది... మిమ్మల్ని తీసుకువెళ్లటానికి అంబులెన్స్ వస్తుంది.. సిద్దంగా ఉండండి.. అని కాల్ సెంటర్ నుంచి ఫోన్ వచ్చింది. వారం గడిచినా అంబులెన్స్ జాడే లేదు. ఊపిరాడక ఆ వృద్ధురాలు మరణించింది.. మా అమ్మ చనిపోయింది... కనీసం నన్నైనా కాపాడండి అంటూ వేడుకుంటుందా బాధితురాలు. ఈ హృదయ విదారక ఘటన అనంతపురంలో జరిగింది.

corona patient died
కరోనాతో వృద్ధురాలి మృతి
author img

By

Published : Jul 27, 2020, 10:20 PM IST

ఇంట్లోనే మృతి చెందిన కరోనా బాధితురాలు

కరోనా బాధితుల విషయంలో అనంతపురం జిల్లా అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయికి చేరుకుందో చెప్పేందుకు ఈ హృదయ విదారక ఘటనే సాక్ష్యం. అనంతపురం సునీత నగర్​లో ఉంటున్న ఓ వృద్ధురాలు కరోనాతో మృతి చెందింది. వారం రోజుల క్రితం మరణించిన బాధితురాలితో పాటు ఉంటున్న ఆమె కుమార్తెకు కరోనా పాజిటివ్​గా నిర్థరణ అయ్యిందని కాల్​ సెంటర్​ నుంచి ఫోన్ చేసి చెప్పారు.

మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకువెళ్లటానికి అంబులెన్స్ వస్తుందనీ.. సిద్ధంగా ఉండాలని కాల్​ సెంటర్ వారు చెప్పారు. అయితే వారం నుంచి ఎదురు చూసిన వీరికి నిరాశే మిగిలింది. దీంతో స్థానిక సచివాలయంలో చెప్పగా.. ఆసుపత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలనీ.. అక్కడ బెడ్లు లేవని చెప్పినట్లు బాధితురాలు వాపోయింది. తన తల్లి ఊపిరాడక చనిపోయిందనీ.. ఉదయం చనిపోతే మృతదేహాన్ని తీసుకువెళ్లటానికి ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. సాయంత్రం 6 గంటల నుంచి మృతదేహం నుంచి వాసన రావటంతో భయాందోళనకు గురైన బాధితురాలు.. తన తల్లిని ఎలాగూ కాపాడలేకపోయారు.. కనీసం తననైనా రక్షించండి అంటూ అర్థిస్తోంది.

ఇదీ చదవండి: చికిత్స అందించలేదని గొంతు కోసుకున్న కరోనా బాధితుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.