ETV Bharat / state

అనంతలో వైద్య బృందంలోని నలుగురికీ కరోనా పాజిటివ్ - అనంతలో కరోనా విజృంభన

అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మక్కా నుంచి తిరిగొచ్చిన ఓ వృద్ధుడు చనిపోయాక నమూనాలు పరీక్షించగా...పాజిటివ్‌గా తేలింది. ఆయనకు వైద్యం అందించిన బృందంలో నలుగురికి కరోనా నిర్ధారణ అయింది. ఈ ఘటనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

అనంతలో కరోనా విజృంభన
అనంతలో కరోనా విజృంభన
author img

By

Published : Apr 9, 2020, 7:47 AM IST

అనంతలో కరోనా విజృంభన

అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. లేపాక్షికి చెందిన పదేళ్ల బాలుడికి తొలుత కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. ఆ ఆతర్వాత మక్కా వెళ్లి వచ్చిన హిందూపురానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడిలో వ్యాధి లక్షణాలు కనిపించగానే... స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి అనంతపురానికి మార్చారు. అయితే అప్పటికే వృద్ధుడికి ఆస్తమా ఉన్నందున క్షయవ్యాధి వార్డుకు పంపించి...సాధారణ రోగులతోపాటు చికిత్స చేస్తూ వచ్చారు.

వ్యాధి తీవ్రత పెరగటంతో ఈ నెల 4న వృద్ధుడు మృతి చెందాడు. ఆ తర్వాత నమూనాలు తీయించి వైరాలజీ ల్యాబ్‌కు పంపగా...కరోనా వ్యాధితోనే చనిపోయినట్లు నిర్ధారణ అయింది. ఈ పరిణామంతో క్షయవ్యాధి వార్డులో వైద్యం అందించిన వైద్యులు, నర్సులు, స్వీపర్లు...మొత్తంగా 24 మందిని క్వారెంటైన్‌కు పంపారు. వారిలో ఇద్దరు వైద్యులు, ఇద్దరు నర్సులకు వైరస్‌ సోకినట్లు బుధవారం తేలింది.

ఈ నెల 4వ తేదీన మృతి చెందిన హిందూపురానికి చెందిన వృద్ధుడు... అప్పటిదాకా చికిత్స పొందిన క్షయవ్యాధి వార్డులో వైద్యం చేయించుకున్న కల్యాణదుర్గానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు తర్వాత చనిపోయాడు. వైద్యం అందించిన బృందాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్న అధికారులు... వారిని మాత్రమే క్వారెంటైన్‌కు పంపించారు. వారి కుటుంబీకులు, స్నేహితులు, వీరితో కలిసిన ఇతరుల గురించి ఆలోచించలేదు. వైరస్ సోకిన హౌస్‌ సర్జన్‌తోపాటు 40 మంది కలిసి ఉన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వీరందర్నీ పరీక్షిస్తే తప్ప ఎవరెవరు వైరస్ బాధితులో తెలిసే అవకాశం లేదు. అలాగే సిబ్బంది కుటుంబీకులు, సన్నిహితులపైనా దృష్టి పెట్టాలనే అభిప్రాయం ఆసుపత్రి వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఇదీచదవండి

కన్నబిడ్డను తాకలేక తల్లడిల్లిన​ తల్లి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.