అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కొత్తకోటకు చెందిన వ్యక్తికి కరోనా సోకింది. కూలీ పనుల కోసం ముంబయి వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి... మహమ్మారి బారిన పడ్డాడని అధికారులు తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు గ్రామాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. కొత్తవాళ్లు, వలస వెళ్లిన వారు ఎవరూ ఊరిలోకి రాకుండా పహారా కాస్తున్నారు.
వైద్య ఆరోగ్య శాఖ, ఆశా కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించి జ్వరం, దగ్గు, జలుబు ఉన్న వారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముంబయి నుంచి వచ్చిన మరో 10 మందిని క్వారంటైన్ కు తరలించారు. లాక్ డౌన్ ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: