ETV Bharat / state

రాత నేర్పించిన వారి రాతలే మారిపోయాయి

కరోనా మహమ్మారి నిరుపేదల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. లక్షల వేతనం తీసుకునే సాఫ్ట్ వేర్ నిపుణులు మొదలు, పట్టణ ప్రాంతాల్లో కిరాణా అంగళ్లలో పనిచేసే చిరు ఉద్యోగుల వరకు అందర్నీ కరోనా కంటతడి పెట్టిస్తోంది. తలిదండ్రుల నుంచి వేల రూపాయలు ఫీజులు దండుకునే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు చాలా చోట్ల టీచర్లకు వేతనాలు కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో, మండల కేంద్రాల్లోని చిన్నపాటి ప్రైవేటు స్కూల్స్ వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూలీ వెతుక్కుంటూ పొలంబాట పట్టారు.

అక్షరాలు నేర్పించిన చేతులు.. కూలీ పనులు చేస్తున్నాయి

author img

By

Published : Aug 11, 2020, 11:01 PM IST

అక్షరాలు నేర్పించిన చేతులు.. కూలీ పనులు చేస్తున్నాయి

కరవు జిల్లాల్లో ప్రైవేట్ స్కూళ్ల టీచర్లకు పూటగడవటమే కష్టంగా మారింది. కరోనా కారణంగా పాఠశాలలు మూసివేయటంతో యాజమాన్యాలు బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వటంలేదు. కొన్ని కార్పొరేట్ పాఠశాలలు మాత్రం ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తూ, బోధన చేస్తున్న టీచర్లకు సగం జీతం మాత్రం చెల్లిస్తున్నాయి. మండల ప్రాంతాల్లోని చిన్నపాటి కాన్వెంట్ స్కూల్ టీచర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రైవేట్ టీచర్లుగా పనిచేస్తున్న చాలా కుటుంబాలు ఒక్కపూట తిండికి కూడా నోచుకోక దుర్భరమైన జీవితం గడుపుతున్నాయి.

ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కొన్నిచోట్ల ఏప్రిల్ వరకు వేతనాలు ఇవ్వగా, మరికొన్ని చోట్ల విద్యార్థులు ఫీజులు చెల్లించటంలేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో ఉపాధిహామీ పనులకు వెళ్లిన ప్రైవేట్ టీచర్లు అనేకచోట్ల కనిపించగా, వ్యవసాయ పనులు మొదలు కావటంతో కూలీకి వెళుతున్నారు. ప్రైవేట్ స్కూల్ మూతవేయటంతో పంటపొలాల్లో కలుపు తీస్తూ కనిపించిన అక్కాచెల్లెళ్లను ఈటీవీ భారత్​ పలకరించగా, ఇల్లు గడవటమే కష్టంగా మారిందని, కూలీ పని చేయాల్సి వచ్చిందని చెప్పారు. బీకాం, బీఎస్సీ లు చదివిన కూలీగా పని చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతపురం జిల్లాలో 1247 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. వీటిలో బహుళ అంతస్తుల భవంతుల్లో ఉన్న పాఠశాలలు మాత్రం టీచర్లకు సగం వేతనం ఇస్తున్నాయి. మరికొన్ని చోట్ల విద్యార్థుల తలిదండ్రులతో పుస్తకాలు కొనిపించేలా ఒత్తిడి తెచ్చే టీచర్లకు కొద్దిపాటి వేతనం ఇస్తున్నారు. ఇలా అనేక మార్గాల్లో టీచర్లతో పనిచేయిస్తూ కరోనా కాలంలో వారితో కంటతడి పెట్టిస్తున్నారు. ఉన్నతంగా చదువుకొని కార్పొరేట్ స్కూళ్లలో పనిచేసే చాలా మంది టీచర్ల ఆయా యాజమాన్యాలు చెప్పే పనులన్నీ చేయలేక ఉద్యోగం మానేస్తున్నారు. ఇప్పటికే ప్రైవేట్ స్కూల్ టీచర్లంతా పలుమార్లు వీధుల్లోకి వచ్చి తమను ఆదుకోవాలని అటు యాజమాన్యాలకు, ప్రభుత్వానికి వేడుకుంటున్నారు. ఇలాంటి నిరుపేద ప్రైవేట్ టీచర్లకు వ్యవసాయ పనులు నేర్పించి, రెడ్స్ అనే సంస్థ వ్యవసాయ క్షేత్రాల్లో పని కల్పిస్తోంది.

ఇదీ చదవండి: మాకు మహానగరాలు లేవు.. మెరుగైనవైద్యం కోసం సహకారం ఇవ్వండి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.