శిల్పకళలకు నిలయమై.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి ఆలయానికి ఈనెల 31 వరకు సందర్శనకు అనుమతులు నిలిపివేశారు. ఈ మేరకు భారతదేశ పురాతత్వ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పర్యాటక కేంద్రమైన లేపాక్షి ఆలయానికి అనునిత్యం రాష్ట్రం నలుమూలల నుంచే కాక దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభలుతుండటం వలన ఈనెల 31 వరకు రాకూడదు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. పురాతత్వశాఖ ఆలయ పరిసర ప్రాంతాల్లో బారికేడ్లను కట్టారు.
ఇవీ చూడండి...