ETV Bharat / state

జిల్లాలో పెరుగుతున్న కరోనా మరణాలు

అనంతపురం జిల్లాలో కరోనా మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మార్చి నుంచి నేటి వరకు కోవిడ్ కోరల్లో చిక్కి 188 మంది ప్రాణాలు కోల్పోయారు మృతి చెందుతున్న వారిలో ఎక్కువ మంది ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నవారే.

corona deaths increasing in ananthapur district
అనంతపురం జిల్లాలో కరోనా మరణాలు
author img

By

Published : Aug 11, 2020, 9:07 PM IST

అనంతపురం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న కొద్దీ... మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా మంగళవారం విడుదల చేసిన బులెటిన్ లో 959 మందికి కొత్తగా వైరస్ సోకింది. ఇప్పటికే చికిత్స పొందుతున్న 6433 మందిలో 13 మంది మృత్యువాత పడ్డారు. మార్చి నుంచి నేటి వరకు కొవిడ్ కోరల్లో చిక్కి 188 మంది ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య కూడా ఇప్పటి వరకు 25వేల 700 కు చేరుకుంది.

మృతి చెందుతున్న వారిలో ఎక్కువ మంది ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నవారే కావటంతో ఆక్సిజన్ సిలెండర్లు ఏర్పాటు అనివార్యంగా మారింది. ఆసుపత్రికి రోగులు రాగానే, తొలుత ఆక్సిజన్ అమర్చాలని, ఆ తరువాతే రోగికి సంబంధించిన వివరాలు నమోదు చేయాలని అధికారులు వైద్యులకు ఆదేశాలిచ్చారు.

అనంతపురం నగరంలోనే రోజూ 250 నుంచి మూడు వందల మంది కొత్తగా వైరస్ బారిన పడుతున్నారు. తాడిపత్రి, ధర్మవరం, ఉరవకొండ, కదిరి ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఎక్కడికక్కడ కొవిడ్ రోగులకు వైద్యం అందించటానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొవిడ్ రోగులకు ఆక్సిజన్ అమర్చటమే వైద్య ప్రక్రియలో కీలకంగా మారటంతో, అదనంగా సిలెండర్లు తెప్పించటానికి ఆసుపత్రి అధికారులు జిల్లా యంత్రాగంతో చర్చలు జరుపుతున్నారు.

ఇదీ చదవండి: 24 గంటల వ్యవధిలో 9,024 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.