అనంతపురం జిల్లాలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. కదిరి పట్టణంలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు. కదిరిలో తహసీల్దార్, సబ్‌రిజిస్టార్, ట్రెజరీ కార్యాలయాలు, న్యాయస్థాన సముదాయాలు ఒకే చోట ఉంటాయి. కార్యాలయాల్లో వివిధ పనుల కోసం వచ్చేవారి సంఖ్య పెరిగింది. కరోనా వ్యాప్తితో ప్రభుత్వ కార్యాలయాల సముదాయ ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. వాహనాల రద్దీని నియంత్రిస్తున్నారు. కార్యాలయాల్లో పనుల కోసం వచ్చేవారిని ఆ మార్గంలో లోపలికి అనుమతిస్తున్నారు. కరోనా మహమ్మారి వల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని వివరిస్తూ... వచ్చినవారు పని పూర్తి అయిన వెంటనే వెళ్లిపోవాలంటూ రెవెన్యూ కార్యాలయ సిబ్బంది సూచిస్తున్నారు. వీటితో పాటు పట్టణంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు... 24 గంటల్లో 425 నమోదు