ETV Bharat / state

CONSTABLE WARNING: కానిస్టేబుల్ హెచ్చరికలు.. కేసులు పెడతామంటూ ఉద్యోగులపై జులూం

CONSTABLE WARNING: అనంతపురం జిల్లాలో నిరసనలు చేస్తున్న సచివాలయ ఉద్యోగులపై.. ఓ కానిస్టేబుల్ కేసులు పెడతామంటూ హెచ్చరికలు చేస్తూ జులూం ప్రదర్శించాడు. తాను చెప్పినట్లు నడుచుకోవాలని ప్రదర్శనకారులకు హుకుం జారీ చేశాడు.

CONSTABLE WARNING TO SACHIVALAYA EMPLOYEES
CONSTABLE WARNING
author img

By

Published : Jan 11, 2022, 3:08 AM IST

Updated : Jan 11, 2022, 4:36 AM IST

CONSTABLE WARNING TO SACHIVALAYA EMPLOYEES: 'మీరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు వ్యక్తులు' కాదంటూనే.. ఒక కానిస్టేబుల్ సచివాలయ ఉద్యోగులపై జులూం ప్రదర్శించాడు. అనంతపురం జిల్లా కదిరిలో.. కదిరి మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని ఇతర మండలాలకు చెందిన సచివాలయ ఉద్యోగులు ప్రదర్శనగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని.. అక్కడ ఆర్డీవో వెంకటరెడ్డి వినతిపత్రం ఇచ్చారు.

స్వామి భక్తితో..

ప్రొబేషన్ డిక్లర్ చేయాలంటూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల్లో భాగంగా ప్రదర్శనకు చేపట్టారు. సచివాలయ ఉద్యోగుల ప్రదర్శనను అనుచరించిన కానిస్టేబుల్.. అప్పటి వరకు మామూలుగానే ఉన్నాడు. ఆర్డీవో కార్యాలయం నుంచి డీఎస్పీ కార్యాలయానికి వెళ్తున్నట్లు తెలుసుకున్న కానిస్టేబుల్.. ఒక్కసారిగా స్వామిభక్తి ప్రదర్శించటం మెుదలు పెట్టాడు.

కేసులు పెడతామంటూ హెచ్చరికలు..

డీఎస్పీని కలవాలంటే నినాదాలు చేయవద్దంటూ సచివాలయ సిబ్బందికి హుకుం జారీ చేశాడు. 'మీరు ప్రభుత్వ ఉద్యోగులు' అంటూనే.. ఏయ్ బాబూ నినాదాలు చేస్తే వీడియో తీసి కేసులు పెడతామంటూ అక్కడి వారిని హెచ్చరించాడు. కేవలం ఐదుగురు వ్యక్తులు మాత్రమే డీఎస్పీని కలవడానికి వెళ్లాలని.. లేదంటే కేసులు తప్పవంటూ బెదిరించాడు. చేసేది లేక సచివాలయ ఉద్యోగులు కానిస్టేబుల్ సూచన మేరకు కొంతమంది మాత్రమే వెళ్లి వినతి పత్రం సమర్పించి వెనుతిరిగారు. తమ సమ్యలను చెప్పుకునేందుకు కూడా అనుమతివ్వకపోవడం పోలీసు నిరంకుశత్వాన్ని చాటుతోందని కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

కానిస్టేబుల్ హెచ్చరికలు.. కేసులు పెడతామంటూ ఉద్యోగులపై జులుం

ఇదీ చదవండి: PARITALA SRIRAM: 'ప్రతి తెలుగుదేశం కార్యకర్తా.. ఒక పరిటాల రవి కావాలి'

Last Updated : Jan 11, 2022, 4:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.