అనంతపురంలో యువతి కిడ్నాప్ కేసును 30 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం నలుగురిపై కేసు నమోదు చేశామని... వీరికి సహకరించిన మరో 18 మందిపై చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నెల రెండో తేదీ సాయంత్రం అనంతపురానికి చెందిన ఓ యువతి కిడ్నాప్‌నకు గురైంది. కర్నూలు జిల్లాలోని అవుకు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ భగీరథ తన మిత్రుల సహాయంతో యువతిని అపహరించాడు. బాధితురాలికి నిందితుడితో గతంలో నిశ్చితార్థం అయ్యింది. అయితే అతని ప్రవర్తన నచ్చక పెళ్లికి నిరాకరించారు యువతి కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో యువతిని ఎలాగైనా దక్కించుకోవాలన్న దుర్బుద్ధితో భగీరథ ఈ కిడ్నాప్‌నకు పాల్పడ్డాడు.
పట్టించిన సెల్‌ఫోన్
బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు.. తాడిపత్రి సమీపంలో ఓ సెల్‌ఫోన్ దొరికింది. దాని సహాయంతో నిందితులు తిరుపతి వైపు వెళ్తున్నట్లు సమాచారం రావటంతో బనగానపల్లి సమీపంలో కారులో వెళ్తున్న కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన కానిస్టేబుల్ భగీరథతో సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నామని... ఈ కిడ్నాప్‌నకు సహకరించిన మరో 18 మందిని అరెస్టు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ ఏసుబాబు తెలిపారు. మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి