ETV Bharat / state

యువతిని మోసం చేసిన ఏఆర్​ కానిస్టేబుల్ అరెస్ట్

పెళ్లి చేసుకుంటానని యువతికి మాయమాటలు చెప్పి మోసం చేశాడో ఏఆర్​ కానిస్టేబుల్. పెళ్లి చూపులు అని యువతి ఇంటికి కూడా వెళ్లాడు. అంతా ఓకే అయ్యాక... మాటమార్చాడు. 'నేను నిన్ను పెళ్లి చేసుకోను... ఎవరికైనా చెబితే అంతు చూస్తా' అని బెదిరించాడు. మోసపోయానని తెలుసుకున్న యువతి... జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. ఎస్పీ ఆదేశాలతో విచారణ జరిపిన పోలీసులు.... ఏఆర్​ కానిస్టేబుల్​ను అరెస్టు చేశారు.

యువతిని మోసం చేసిన ఏఆర్​ కానిస్టేబుల్ అరెస్ట్
యువతిని మోసం చేసిన ఏఆర్​ కానిస్టేబుల్ అరెస్ట్
author img

By

Published : Oct 8, 2020, 8:23 PM IST

అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువతిని వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేసిన కేసులో ఏఆర్ కానిస్టేబుల్ సుధీర్ బాబును అరెస్టు చేసినట్టు దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. 2013 బ్యాచ్​కు చెందిన కానిస్టేబుల్ సుధీర్ బాబు మొబైల్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండేళ్ల పాటు సన్నిహితంగా ఉన్నాడు. యువతి ఇంటికి పెళ్లి చూపులకూ వెళ్లాడు. చివరికి మాట మార్చి... పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఎవరికైనా చెబితే అంతు చూస్తానని యువతిని బెదిరించినట్లు తెలిసిందని డీఎస్పీ తెలిపారు.

ఈ ఘటనతో మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్యాయత్నం చేసిందని డీఎస్పీ చెప్పారు. యువతి తల్లిదండ్రులతో కలిసి జిల్లా ఎస్పీకి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి, దర్యాప్తులో లభించిన సాక్ష్యాధారాల ప్రకారం ఏఆర్ కానిస్టేబుల్ సుధీర్ బాబును అరెస్టు చేసి రిమాండ్​కు తరలించామని డీఎస్పీ తెలిపారు. ప్రేమ, పెళ్లి విషయాల్లో మాయమాటలు చెప్పేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలని యువతులకు డీఎస్పీ సూచించారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

ఇదీ చదవండి:

తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి అమరావతి సెగ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.