పట్టణాలు, గ్రామాలు అని తేడా లేకుండా కొవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా వైద్య, పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినప్పటికీ అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతాపల్లి గ్రామస్థుల్లో ఎలాంటి మార్పు లేదు. గ్రామంలో సుమారు 45 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కానీ వాళ్లలో ఎటువంటి భయం లేకుండా రచ్చబండలపైన గుంపులు గుంపులుగా కూర్చొని మాట్లాడుతూ కనిపిస్తున్నారు.
గ్రామ సచివాలయ మహిళా పోలీసు.. కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని గ్రామస్థులకు సూచించారు. వారు వినకపోవటంపై.. ఉన్నతాధికారులు స్పందించాలని ఆడియో సందేశం ద్వారా ఫిర్యాదు చేశారు. ఒక్కో కుటుంబంలో ఐదారు కరోనా కేసులు ఉన్నాయని.. కొవిడ్ సోకిన ఏ ఒక్కరూ.. హోమ్ క్వారంటైన్లో ఉండట్లేదని చెప్పారు. తాము ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదని ఆవేదన చెందారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సచివాలయ ఉద్యోగులూ కోరుతున్నారు.
ఇదీ చదవండి:
ప్రాణవాయువు సరఫరా పై శ్రద్ధ పెట్టండి.. లేదంటే ఆ దేవుడు కూడా క్షమించడు: లోకేశ్