అనంతపురం జిల్లా హిందూపురం వైకాపాలో విబేధాలు భగ్గుమన్నాయి. పార్టీలో నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగట్లేదని కొంతమంది వాపోయారు. ఎమ్మెల్సీ ఇక్బాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తొమ్మిదేళ్లు పార్టీ కోసం పనిచేసిన వారికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నష్టపోతుందని స్పష్టం చేశారు. దీనిపై అధిష్టానం దృష్టిసారించాలని కోరారు.
ఇవీ చదవండి..