ETV Bharat / state

కంటైన్మెంట్ జోన్​​ను ఎత్తివేయాలని గుంతకల్లు వాసుల ఆందోళన

కంటైన్మెంట్ జోన్​ను ఎత్తివేయాలని అనంతపురం జిల్లా గుంతకల్లు ఆంథోనిస్ట్రీట్ వాసులు నిరసన చేశారు. నిత్యావసరాలు, కూరగాయలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

concerned about lifting the red zone in gunthakallu anathapuram district
రెడ్​జోన్​ను ఎత్తివేయాలంటూ గుంతకల్లు వాసుల ఆందోళన
author img

By

Published : May 8, 2020, 7:56 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లు అంథోనిస్ట్రీట్​లో కంటైన్మెంట్ జోన్​ను ఎత్తి వేయాలని కాలనీ వాసులు ఆందోళన చేశారు. పనులు లేక, నిత్యావసర వస్తువులు లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్​జోన్​గా ప్రకటించి 21 రోజులు అవుతున్నా కేవలం బియ్యం, కందిపప్పు , రూ.వెయ్యితో ఎలా బతకాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంతవరకు తమను ఏ రాజకీయ నాయకులు గానీ, అధికారులు గానీ పట్టించుకోలేదని వాపోయారు. రెండు రోజుల్లో రెడ్​జోన్​ను ఎత్తివేయాలని మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో రోడ్లపైకి వచ్చి ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని స్థానిక తహసీల్దార్ హరికుమార్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఇదీచదవండి.

స్వస్థలాలకు పంపాలని వలస కూలీల వేడుకోలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.