ETV Bharat / state

హిందూపురంలో వస్త్ర వ్యాపారుల ఆందోళన - hindhupur cloths merchants agitation

లాక్​డౌన్ సడలింపుల్లో వస్త్ర దుకాణాలు తెరిచేందుకు అనుమతులివ్వాలని... అనంతపురం జిల్లా హిందూపురంలో వస్త్ర వ్యాపారులు ఆందోళనకు దిగారు. అధికారులు స్పందించకపోవటంతోనే తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించామన్నారు.

cloths merchants agitation for lock down exemptions
హిందూపురంలో వస్త్ర వ్యాపారుల ఆందోళన
author img

By

Published : Jun 8, 2020, 6:33 PM IST

వస్త్ర వ్యాపారులకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ... అనంతపురం జిల్లా హిందూపురంలో వస్త్ర వ్యాపారులు తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించారు. దాదాపు 3 నెలల నుంచి దుకాణాలు మూతపడటంతో... వ్యాపారస్తులతో పాటు దుకాణాల్లో పనిచేసే సిబ్బంది తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఇప్పటికైనా లాక్​డౌన్ సడలింపుల్లో వస్త్ర దుకాణాలు తెరిచేందుకు అనుమతివ్వాలని కోరారు. అధికారులకు ఇప్పటికే పలుమార్లు వినతిపత్రం ఇచ్చినప్పటికీ... అధికారులు స్పందించకపోవటంతోనే తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించాల్సి వచ్చిందని వారు వివరించారు. వీరి సమస్యలపై సానుకూలంగా స్పందిస్తానని తహసీల్దార్ హామీతో వస్త్ర వ్యాపారులు ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి: 'వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.